70 అడుగుల లోతుగల బోరుబావిలో పడిన పిల్లాడు
బోరుబావిలో ఆభంశుభం తెలియని పిల్లలు ఎంత మంది పడిపోతున్నా, అలాంటి వార్తలు చాలా వస్తున్నా బోరు బావి వేసినప్పుడు వ్యక్తులు శ్రద్ధ తీసుకోవడం లేదు. దాని కప్పిఉంచడమో లేక పూడ్చి వేయడమో చేయడం లేదు. ఓ చిన్నారి ఆడుకుంటూ 70 అడుగుల లోతుగల బోరుబావిలో పడిపోయాడు.
బావిలో నుండి చిన్నారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన హర్యానాలోని హిసార్‌కు చెందిన బాల్ సమంద్ ప్రాంతంలో నిన్న సాయంత్రం చోటుచేసుకుంది.
పిల్లాడు బోరుబావిలో పడిపోవడాన్ని గమనించిన తోటి చిన్నారులు గట్టిగా కేకలు వేస్తూ సమీపంలో ఉన్న స్థానికులకు సమాచారం అందించారు. బాలుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.
అలాగే పోలీసులకు, అధికారులకు కూడా సమాచారం అందించారు. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి పిల్లాడికి పైపుల ద్వారా ఆక్సీజన్ అందిస్తున్నారు. పిల్లాడిని బయటకు తీసేందుకు ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది.