శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2022 (13:03 IST)

వాహనం నడుపుతుండగా బస్సు డ్రైవర్‌కు గుండెపోటు

Bus
Bus
వాహనం నడుపుతున్నప్పుడు బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా బస్సు అదుపు తప్పింది. వాహనం అదుపు తప్పి ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో గురువారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి ఒక బస్సు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనలో బస్సు ప్రజలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.
 
ఈ తతంగం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వగా, ఆ దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.