గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మే 2024 (09:04 IST)

ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేసిన కోల్‌కతా హైకోర్టు

court
గత 2010-12 సంవత్సరాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 37 తరగతులను కొట్టివేస్తూ కోల్‌కతా హైకోర్టు  సంచలన తీర్పును వెలువరించింది. కొన్ని నిబంధనలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత 2012 నాటి వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్దంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 37 క్లాసులను కొట్టివేస్తున్నట్టు తీర్పు వెలువరించింది. 
 
ఈ వర్గీకరణలు చట్టవిరుద్దంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల 2010 తర్వాత ఈ క్లాజులకు ఓబీసీ కింద జారీ చేసిన సర్టిఫికేట్లను అన్నింటిని రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. 1993 నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే, ఓబీసీ ధృవపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేసతున్న వారిై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం పేర్కొంది.