సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (09:05 IST)

కాలేజీ అమ్మాయి పేరుతో డేటింగ్ అంటూ యువకులను మోసం చేస్తున్న కి'లేడీ'

కాలేజీ అమ్మాయి పేరుతో నాతో డేటింగ్ చేస్తారా అంటూ యువకులకు వల వేస్తూ పలువురిని మోసం చేసిన ఓ కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘరానా మోసం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్

కాలేజీ అమ్మాయి పేరుతో నాతో డేటింగ్ చేస్తారా అంటూ యువకులకు వల వేస్తూ పలువురిని మోసం చేసిన ఓ కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘరానా మోసం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
న్యూఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతానికి చెందిన ఓ కళాశాల అమ్మాయి డేటింగ్ యాప్‌తో వాట్సప్‌లో ఇద్దరు యువకులతో ఛాటింగ్ చేసింది. ఆ అమ్మాయితో గడిపేందుకు రూ.7000 చెల్లించేలా ఆ యువకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఇద్దరు యువకులు రాత్రి 10 గంటలకు ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ప్రాంతానికి వెళ్లి ముందుగా అనుకున్న ప్రకారం అమ్మాయి స్నేహితుడు ఆలంను కలిశారు. 
 
ఆలం ఆ ఇద్దరు యువకులను కిరణ్ గార్డెన్‌లోని అమ్మాయి ఇంటికి తీసుకెళ్లాడు. యువకులతో మద్యం తాగించాక తమకు డబ్బులివ్వకుంటే తప్పుడు కేసు పెడతామని బెదిరించి వారి నుంచి అమ్మాయి రూ.11 వేలను గుంజుకుంది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన యువకులు ఇచ్చిన ఫిర్యాదుతో బిందాపూర్ పోలీసులు దాడి చేసి కళాశాల అమ్మాయితోపాటు ఆమెకు సహకరించిన ఆలం అనే వ్యక్తిని అరెస్టు చేశారు.