సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 7 జులై 2016 (11:39 IST)

రంజాన్‌కు పేల్చేస్తామన్నారు.. పేల్చేశారు.. బంగ్లాలో రంజాన్ ప్రార్థనల సమయంలో మరోసారి పేలుడు!

రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం పండుగ రంజాన్ సందడి నెలకొంది. ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మీరాలం ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు మక్కామసీదుకు ముస్లింలు పెద్ద

రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం పండుగ రంజాన్ సందడి నెలకొంది. ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మీరాలం ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు మక్కామసీదుకు ముస్లింలు పెద్ద సంఖ్యలో చేరుకుని సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. ఈద్-ఉల్-ఫితర్ పండగను పురస్కరించుకొని నగరంలోని ఈద్గాలన్నీ నమాజ్‌లతో కిక్కిరిసిపోతున్నాయి.
 
ముస్లింలు ఆనందోత్సాహంతో పండుగను జరుపుకుంటున్న తరుణంలో ఉగ్రవాదులు మరోసారి భీభత్సం సృష్టించారు. బంగ్లాదేశ్‌లోనే అతి పెద్ద ఈద్గా వద్ద గురువారం ఉదయం ముష్కరులు బాంబుదాడులు చేశారు. బంగ్లా రాజధాని ఢాకాకు 100 కిలోమీటర్ల దూరంలోని కిశోర్ గంజ్ పట్టణ శివారులో గల షోలాకియా ఈద్గా.. ఆ దేశంలోనే అతిపెద్ద ప్రార్థనా స్థలం. ఈ శుభదినం నాడు దాదాపు 4 లక్షల మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. 
 
జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాన్ని అవకాశంగా తీసుకున్న ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈద్గా ప్రవేశ ద్వారం వద్ద చోటుచేసుకున్న పేలుడులో ఒక పోలీస్ అధికారి మరణించగా, 12 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నామని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. 
 
కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. గత వారం ఢాకాలోని ఓ రెస్టారెంట్‌లోకి చొరబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు 20 మందిని హతమార్చిన ఘటన మరువక ముందే ఈ విషాదం చోటుచేసుకుంది.