బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 31 మే 2017 (12:50 IST)

దాసరి చరమాంకంలో మాయని మచ్చగా నిలిచిపోయింది.. అదొక్కటే?

ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు మంగళవారం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. సినిమా రంగంలో రాణించిన దాసరి నారాయణరావు రాజకీయ నేత్తగానూ ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నత పదవులను

ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు మంగళవారం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. సినిమా రంగంలో రాణించిన దాసరి నారాయణరావు రాజకీయ నేత్తగానూ ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్నత పదవులను అలంకరించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.

అయితే దాసరి రాజకీయ జీవితంలో బొగ్గు స్కామ్ మాయని మచ్చగా మిగిలిపోయింది. దీనిపై విచారణ కూడా జరుగుతోంది. అయితే దాసరి మాత్రం బొగ్గు స్కామ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని పలుసార్లు చెప్పారు. అయితే క్విడ్ ప్రోకో ద్వారా దాసరి నారాయణ రావు లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 
 
తలబిరా బొగ్గు గనులను ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న నైవేలి లిగ్నైట్ లిమిటెడ్‌తో పాటు మరో సంస్థకు కేటాయించాలని బొగ్గు గనుల శాఖ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసింది. కానీ వాటిని ప్రైవేట్ రంగంలోని హిందాల్కో సంస్థకు కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపుల్లో దాసరి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

అయితే దీనిపై సీబీఐ విచారణ జరుగుతున్నా.. దాసరిపై ఉన్న అభియోగాలు రుజువు కాలేదు. ఇంకా నిర్ధారణ కూడా కాలేదు. దీంతో దాసరి చరమాంకంలో కోల్ స్కామ్ మాయని మచ్చగా మారిపోయింది.