గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Modified: మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (08:40 IST)

ఢిల్లీలో దారుణం... టీచర్‌‌ను ఇద్దరు విద్యార్థులు కత్తులతో పొడిచారు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తరగతి గదిలో పాఠాలు చెపుతున్న ఉపాధ్యాయుడిని సహ విద్యార్థుల సమక్షంలోనే ఇద్దరు విద్యార్థులు కత్తులతో పొడిచారు. ఆ టీచర్ ఇపుడు చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

ఈ వివరాలను పరిశీలిస్తే... రాజధాని ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ స్కూల్‌ ఉంది. ఇందులో 12వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులను హాజరు శాతం తక్కువగా ఉందన్న ఉద్దేశ్యంతో తొలగించారు. 
 
దీంతో ఆ ఇద్దరు విద్యార్థులు కలిసి టీచర్‌తో వ్వాగ్వాదానికి దిగారు. అపుడు ఉన్నట్టుండి ఇద్దరూ విద్యార్థులు కలిసి టీచర్‌ను కత్తులతో పొడిచారు. దీంతో ఒక్కసారి దిగ్భ్రమకు గురైన సహ విద్యార్థులు... కత్తిపోట్లలో తీవ్రంగా గాయపడిన టీచర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఉపాధ్యాయుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.