గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జులై 2023 (15:39 IST)

ఢిల్లీ వరదలకు హర్యానా సర్కారే కారణం.. ఆప్ నేత సంచలనం

floods
ఢిల్లీ వరదలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని సంజయ్ అన్నారు. తమ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే హర్యానా బీజేపీ ప్రభుత్వం హత్నీ కుండ్ బ్యారేజ్ నుంచి యమునా నదికి నీటిని వదులుతోందని దుయ్యబట్టారు. 
 
వరదలు వస్తే హత్నీ కుండ్ నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ వైపునకు సమతూకంలో నీటిని విడుదల చేయాల్సి వుంది. మూడు రాష్ట్రాలకు సమానంగా నీటిని విడుదల చేసేందుకు మూడు కెనాల్స్ ఉన్నాయని, కానీ, హర్యానా బీజేపీ ప్రభుత్వం మాత్రం ఢిల్లీ సర్కారును ఇరుకున పెట్టాలని కుట్ర చేసిందని సంజయ్ అన్నారు.
 
ఆ ఉద్దేశంతో మిగతా రెండు కాలువలను మూసేసి యమునా నదిలోకి నీటిని భారీగా వదులుతుందని మండిపడ్డారు. మూడు కాలువల ద్వారా నీటిని వదిలి ఉంటే ఢిల్లీలో వరదలు వచ్చి వుండేవి కావన్నారు.