నోట్ల రద్దు... ఆ మహిళ సహనం కోల్పోయింది.. ఆర్బీఐ కార్యాలయం ఎదుట బట్టలు విప్పేసింది
దేశవ్యాప్తంగా నోట్ల రద్దుతో నగదును మార్చుకునేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. నోట్ల మార్పు కోసం గడువు ముగిసిందని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆమె ఏమాత్రం వినలేదు. అంతటితో ఆగకుండా ర
దేశవ్యాప్తంగా నోట్ల రద్దుతో నగదును మార్చుకునేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. నోట్ల మార్పు కోసం గడువు ముగిసిందని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆమె ఏమాత్రం వినలేదు. అంతటితో ఆగకుండా రోడ్డుపై అందరూ నిల్చుని చూస్తుండగా.. బట్టలు విప్పేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఆర్బీఐ కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది.
రెండు రోజులుగా ఆర్బీఐ కార్యాలయం వద్దకు వచ్చినా నోట్లను మార్చుకోవట్లేదు. తీరా లోపలికి వెళ్ళాక రద్దుచేసిన నగదును మార్చుకోవడానికి గడువు కూడా తీరిపోయిందని మహిళకు బ్యాంకు అధికారులు తెలిపారు. ఇళ్ళల్లో పనిచేస్తూ జీవనం సాగించే ఆ మహిళ నాలుగువేల రూపాయలను మార్పిడి చేసుకొనేందుకు వచ్చింది.
తన నగదును మార్చి ఇవ్వాలని ఆమె కోరడంతో పోలీసులు ఆమెను బలవంతంగా జీపులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. పోలీసుల నుండి తప్పించుకొని ఆర్బీఐ గేటు ఎదుటే నిల్చొని అందరూ చూస్తుండగానే తన బట్టలను విప్పేసి నిరసన వ్యక్తం చేసింది.