ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:04 IST)

ఈ యేడాది కూడా హస్తినలో బాణాసంచపై బ్యాన్

నవంబరు నెలలో దీపావళి పండుగను జరుపుకోనున్నారు. అయితే, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఈ పండుగను జరుపుకునేందుకు పలు రకాలైన ఆంక్షలు విధిస్తున్నారు. అదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గట్టి హెచ్చరిక చేశారు. ఈ ఏడాది కూడా దీపావ‌ళి వేళ బాణాసంచా పేల్చ‌రాద‌ని స్పష్టం చేశారు. 
 
ఈ విషయాన్ని ఆయన త‌న ట్విట్ట‌ర్‌ ఖాతా ద్వారా ప్రజలకు తెలిపారు. ఢిల్లీలో ప‌టాకుల‌ను నిల్వ చేయ‌డం, అమ్మ‌డం, వాడ‌డం చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో చెప్పారు. 
 
కాగా, గత యేడాది కూడా బాణాసంచాపై నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. వాయు కాలుష్యం విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో కేజ్రీవాల్ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. గ‌త మూడేళ్ల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.