శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జనవరి 2025 (15:52 IST)

వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు (Video)

Elephant
కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. తిరుర్‌లో జరిగిన పుతియంగడి ఉత్సవానికి వందలాది మంది తరలివచ్చారు. అక్కడ అనేక ఏనుగులు మీద దేవతల ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి ఏనుగుల దగ్గర నుంచి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ ఏనుగుకు పట్టరాని కోపం వచ్చింది. ఆ వెంటనే వారిపైకి దూసుకొచ్చింది. 
 
పైగా, ఫోటో తీయడానికి ప్రయత్నించిన వ్యక్తిని తొండంతో ఎత్తి మరోవైపునకు పడేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 17 మంది గాయపడినట్టు సమాచారం. ఆ వెంటనే మావటి వాళ్లు రెండు గంటల పాటు శ్రమించి ఏనుగులను శాంతింపజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.