సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (16:01 IST)

పేరుకే ప్రొఫెసర్.. కోరిక తీర్చితే మార్కులేస్తానన్నాడు..

కామాంధుల దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు కొందరు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌లోని ప్రభుత్వ కాలేజీలో ఇలాంటి దారుణమే జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఫరీదాబాద్ ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ వ్యక్తి.. మీరు పరీక్షలు బాగా రాసినా రాయకపోయినా మార్కులు వేసేస్తా.. నా కోర్కె తీర్చేస్తే అంటూ అమ్మాయిలను ప్రలోభ పెట్టి లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. విద్యార్థినులు మార్కుల కోసం అతడికి లొంగిపోయారు. దీంతో అతడి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. 
 
ఇదే తరహాలో ఆ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వ్యక్తి కూడా ఓ విద్యార్థిని లైంగికంగా వేధించడంతో.. సదరు విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని చేపట్టిన దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పోలీసు విచారణలో ల్యాబ్ అసిస్టెంట్ లీలతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ రాసలీలలు కూడా బయటపడ్డాయి. పరిస్థితి తెలుసుకున్న ప్రొఫెసర్ పరారయ్యాడు. పోలీసులు ల్యాబ్ అసిస్టెంట్‌ని అరెస్ట్ చేసి, ప్రొఫెసర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.