వెధవల్లారా.. నదిలో మునిగిపోతున్న నా భార్యను ఎందుకు కాపాడార్రా : ఈతగాళ్ళపై భర్త ఫైర్
ఆత్మహత్యాయత్నంలో భాగంగా నదిలో దూకిన భార్యను కాపాడిన గజ ఈతగాళ్ళపై ఓ భర్త మండిపడ్డాడు. చచ్చేదాన్ని చావనీయకుండా.. ఎందుకు కాపాడారురా అంటూ ఆగ్రహించారు. దీంతో ఈతగాళ్లు ఒక్కసారి అవాక్కయ్యారు. ఈ ఘటన అహ్మదాబాద
ఆత్మహత్యాయత్నంలో భాగంగా నదిలో దూకిన భార్యను కాపాడిన గజ ఈతగాళ్ళపై ఓ భర్త మండిపడ్డాడు. చచ్చేదాన్ని చావనీయకుండా.. ఎందుకు కాపాడారురా అంటూ ఆగ్రహించారు. దీంతో ఈతగాళ్లు ఒక్కసారి అవాక్కయ్యారు. ఈ ఘటన అహ్మదాబాద్‌లోని సబర్మతీ నదీ తీరంలో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే... అహ్మదాబాద్‌లోని వల్లభ్ సదన్ వెనుకవైపున్న సబర్మతీ నదిలో మిథఖాలి ప్రాంతానికి చెందిన 37 సంవత్సరాల మహిళ నీటిలోకి దూకింది. దీన్ని చూసిన భరత్ మంగేలా అనే ఫైర్‌మన్ నదిలోకి దూకి ఆమెను కాపాడాడు. ఇది ఆమె భర్తకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ వెంటనే వారిపై గొడవుదిగాడు.
"అమె భర్త వచ్చి మమల్ని ప్రశ్నించాడు. తన భార్య ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవడానికి మీరెవరని అడిగాడు. మా ఫోటోలు తీసుకుని, తర్వాత మీ సంగతి చూస్తానంటూ బెదరించాడు. దీంతో మేము విషయాన్ని పోలీసులకు చెప్పాలని నిర్ణయించాం" అని భరత్ మంగేలా వెల్లడించారు.
అతని ప్రవర్తన తమకు షాక్ కలిగించిందని, ఎవరినైనా కాపాడితే, తమకు ప్రశంసలు లభిస్తాయిగానీ, తమకు తిట్లు ఎదురయ్యాయని చెప్పాడు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.