ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (14:48 IST)

ఆమె మెడలో నాగుపాము.. తలపై కిరీటం.. సత్యవాక్కు.. వీడియో వైరల్

ఆమె మెడలో నాగుపాము.. తలపై అమ్మవారి కిరీటంతో నృత్యం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. కాంచీపురం, వాలాజాబాద్ సమీపంలో వెల్లరి అమ్మోరి ఆలయంలో సత్య వాక్కు చెప్పే మహిళ పేరు కపిల. ఈమె రెండేళ్ల క్రితం కుంభాభిషేకం సమయంలో రెండు నాగుపాములను అద్దెకు తీసుకుంది. తొలుత ఆ నాగులకు నాగ పూజ చేసి పాలాభిషేకం చేసింది. 
 
పూజ ముగిసిన తర్వాత ఆ పాములను మెడకు వేసుకుంది. ఆపై అమ్మోరిగా మారి సత్యవాక్కు చెప్పడం ప్రారంభించింది. దీంతో భక్తులు ఆమెను చుట్టుముట్టారు. ఈ తతంగాన్ని వీడియో తీశారు. ఈ అమ్మోరి ఆలయానికి భక్తుల సంఖ్య గతం కంటే తగ్గడంతో ఈ విధంగా పాపులారిటీ కోసం ఆమె మెడలో పాములు వేసుకుని నృత్యం చేసిందని.. ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్టు కావడంతోనే ఆలయానికి భక్తుల సంఖ్య పెరిగిందని టాక్ వస్తోంది. 
 
ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆలయానికి వెళ్లి ఆరా తీశారు. ఇంకా పాములను పాపులారిటీ కోసం వాడుకుంటున్నారని నిర్ధారించారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.