జీలం నదిలో పడవ బోల్తా-నలుగురు మృతి
జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో జీలం నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో మంగళవారం నలుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. జిల్లాలోని గండ్‌బాల్ వద్ద నదిలో ఏడుగురితో వెళ్తున్న పడవ బోల్తా పడిందని అధికారులు తెలిపారు.
ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, ప్రజలచే రెస్క్యూ వెంటనే నిర్వహించబడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురిని చికిత్స నిమిత్తం శ్రీనగర్‌లోని ఎస్‌ఎంహెచ్‌ఎస్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల మృతదేహాలు వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు.