ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (20:37 IST)

కుట్రాలం జలపాతంలో జారిపడ్డ బాలిక.. కాపాడిన యువకుడు

Kutralam
Kutralam
తమిళనాడులోని కుట్రాలం జలపాతంలో ప్రమాదవశాత్తూ పడిపోయిన నాలుగేళ్ల బాలికను ఓ వ్యక్తి రక్షించడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన తమిళనాడులోని తెన్‌కాసి జిల్లా కుట్రాళం జలపాతం వద్ద గురువారం చోటుచేసుకుంది. ఈ సంఘటన మొత్తం రికార్డ్ చేయబడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 
 
పాలక్కాడ్‌కు చెందిన ఓ జంట తన కుమార్తెతో కలిసి కుట్రాలం జలపాతాన్ని సందర్శించగా, ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో బాలిక ప్రమాదవశాత్తు కొట్టుకుపోయింది. ఆ పాప నీటిలోని రాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించినా జారిపోయింది. 
 
కానీ తూత్తుకుడికి చెందిన విజయ కుమార్ అనే వ్యక్తి నీటిలోకి దిగి బాలికను రక్షించాడు. ఇలా జలపాతం నుంచి బాలిక ప్రాణాలను కాపాడిన వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.