మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (07:37 IST)

ముగిసిన వర్క్ ఫ్రమ్ హోం : నేటి నుంచి కార్యాలయాలకు...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇంతకాలం కొనసాగుతూ వచ్చిన వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యం ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వహించాల్సివుంది. సోమవారం నుంచి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధిగా కార్యాలయ విధులకు హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. అదేసమయంలో రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టాయి.
 
దీంతో వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును రద్దు చేసి, అన్ని శాఖల ఉద్యోగులు విధిగా కార్యాలయాలకు రావాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.