ఆదివారం, 9 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2016 (16:14 IST)

'గాలి' కుమార్తె వివాహానికి నోట్ల రద్దు ఎఫెక్ట్ లేదట... మ్యాటర్ ముందుగానే లీక్ అయిందా?

కర్నాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి గారాలపట్టి బ్రహ్మణి వివాహ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభంకాగా, బుధవారం ఈ వివాహం అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు తరలి వస్తున్నారు.

కర్నాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి గారాలపట్టి బ్రహ్మణి వివాహ వేడుకలు మంగళవారం నుంచి ప్రారంభంకాగా, బుధవారం ఈ వివాహం అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు తరలి వస్తున్నారు. తన స్టేటస్‌కు తగిన విధంగానే గాలి జనార్ధన్ రెడ్డి ఈ వివాహా ఘట్టాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. 
 
ఈ శుభకార్యం కోసం ఓ చిన్నపాటి గ్రామాన్ని సృష్టిస్తూ, అత్యంత ఖరీదైన సెట్టింగ్‌లను ఏర్పాటుచేశారు. ఈ పెళ్లికి రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా. అయితే, దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంత భారీ ఖర్చుతో ఈ పెళ్లిని గాలి జనార్ధన్ రెడ్డి ఎలా చేయగలుగుతున్నారనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ ప్రశ్నలకు ఇపుడు సమాధానం లభించింది.
 
ఈ వివాహ ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేయించేందుకు ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్ కంపెనీకి అప్పగించారు. ఇందుకోసం అయ్యే ఖర్చును గాలి జనార్ధన్ రెడ్డి ముందుగానే నగదు రూపంలో చెల్లించేశారట. ఈ విషయాన్ని ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగే బహిర్గతం చేశారు. ఆరు నెలల క్రితం కుదిరిన ఈ ఒప్పందం కావడంతో ఇపుడు చెల్లని రూ.500, రూ.1000 నోట్లను మార్చుకునేందుకు ఆ కంపెనీయే తంటాలు పడుతోందట. అందువల్లే ఈ వివాహంపై నోట్ల రద్దు ఏమాత్రం పడలేదట.