మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 మే 2017 (12:20 IST)

కారుని బైక్ రాసుకుందని వైద్యుడిని కాల్చిపారేశాడు... ఎక్కడ?

హర్యానాలో ఓ దారుణం జరిగింది. కారును బైక్ రాసుకుందని ఓ వైద్యుడిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్‌కి చెందిన మహావీర్ అనే వైద్యుడు బంధువుతో కలిసి బై

హర్యానాలో ఓ దారుణం జరిగింది. కారును బైక్ రాసుకుందని ఓ వైద్యుడిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్‌కి చెందిన మహావీర్ అనే వైద్యుడు బంధువుతో కలిసి బైక్‌‌పై వెళ్తున్నాడు. వారి బైక్ ఫరూఖ్ నగర్ ప్రాంతంలో టర్న్ తీసుకుంటున్న క్రమంలో కారుని బైక్ రాసుకుంది. దీంతో మహావీర్‌తో కారు డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు. 
 
ఇద్దరూ ఆరోపించుకోవడంతో కారు వెనుక సీట్లో కూర్చున్న డ్రైవర్ సోదరుడు రవి సీట్లోంచి లేచి, తుపాకీతో వైద్యుడిపై నడిరోడ్డు మీద విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. దీంతో మహావీర్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. డ్రైవర్‌కు కూడా బుల్లెట్ దిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనా స్థలికి చేరుకుని, డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. కాల్పులు జరిపిన రవి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాడు.