సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2017 (16:02 IST)

డేరాలో గుర్మీత్ దీపావళి వేడుకలు.. సాధ్వీల మధ్య హుందాగా నడుస్తూ..?

సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలులో చిప్పకూడు తింటున్న డేరాబా దీపావళి పండుగను ఎలా జరుపుకునేవాడో తెలిస్తే షాకవుతారు. ప్రతి ఏడాది డేరా ఆశ్రమంలో దీపావళి ఉత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. డేరా సచ

సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలులో చిప్పకూడు తింటున్న డేరాబా దీపావళి పండుగను ఎలా జరుపుకునేవాడో తెలిస్తే షాకవుతారు. ప్రతి ఏడాది డేరా ఆశ్రమంలో దీపావళి ఉత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. డేరా సచ్ఛాసౌదాలో గతంలో జరిగే దీపావళి వేడుక గురించి హంస్‌రాజ్ అనే వ్యక్తి మీడియాతో చెప్పాడు. గోపికల మధ్య శ్రీకృష్ణుడి స్థాయిలో గుర్మీత్ సాధ్వీల మధ్య దీపావళి చేసుకునేవాడని తెలిపాడు. 
 
అందంగా ముస్తాబై.. సాధ్వీలను కూడా అదే స్థాయిలో కొత్త దుస్తులతో అలకరించుకోవాలని బాబా సూచిస్తాడు. డేరాలో జరిగే దీపావళి వేడుకలను హనీప్రీత్ దగ్గరుండి పర్యవేక్షించేవారు. డేరా ఆశ్రమంలోని యువతులంతా పాత్రలలో దీపాలు వెలిగించి ద్వారం వద్ద నిలుచుంటారు. తరువాత బాబా వారి మధ్య నుంచి హుందాగా నడుచుకుని రావడంతో వేడుక మొదలవుతుంది. 
 
ఈ ఉత్సవంలో సాధ్వీలు, సాధువులు, డేరాలోని పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొనేవారు. దీనికితోడు బాబా ప్రతీఏటా తన ఫొటోలతో కూడిన క్యాలెండర్‌ను ఆవిష్కరించేవాడు. దీపావళి సందర్భంగా డేరా ఆశ్రమంలో కొన్ని లక్షల దీపాలు వెలిగించేవారు. అలాగే ఆశ్రమంలో టపాకుల మోత మోగిపోయేదని హంస్‌రాజ్ వెల్లడించాడు. 
 
దీపావళి ఉత్సవాలతో డేరా ఆశ్రమం కళకళలాడిపోయేదని అతను తెలిపాడు. అయితే ఈ ఏడాది దీపావళి అతని బండారాన్ని బయటపెట్టింది. జైలులో వున్న డేరా బాబాను దీపావళి సందర్భంగా ఆయన భార్య హర్జీత్ వచ్చి చూసి వెళ్లారు. ఇంకా దీపావళి స్వీట్స్ కూడా ఇచ్చి వెళ్తారని జైలు అధికారులు చెప్తున్నారు.