శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2017 (15:52 IST)

చైతు-సమంతల రిసెప్షన్... నాగ్ మాజీ భార్య సంచలన నిర్ణయం

టాలీవుడ్ ప్రేమ జంట నాగ చైతన్య, సమంతలు ఇటీవలే ఓ ఇంటివారయ్యారు. గోవా వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా అతికొద్ది మంది బంధుగణం, స్నేహితుల మధ్య జరిగింది. దీంతో రిసెప్షన్‌ను మాత్రం గ్రాండ్ లెవెల్‌లో ఇచ్చే

టాలీవుడ్ ప్రేమ జంట నాగ చైతన్య, సమంతలు ఇటీవలే ఓ ఇంటివారయ్యారు. గోవా వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా అతికొద్ది మంది బంధుగణం, స్నేహితుల మధ్య జరిగింది. దీంతో రిసెప్షన్‌ను మాత్రం గ్రాండ్ లెవెల్‌లో ఇచ్చేందుకు నాగార్జున ఫ్యామిలీ సిద్ధమైంది. అయితే, నాగార్జున మాజీ భార్య, నాగ చైతన్య తల్లి లక్ష్మి మాత్రం అందర్నీ షాక్‌కు గురిచేసే నిర్ణయం తీసుకుంది.
 
అదేంటంటే... చై-శ్యామ్‌ల రిసెప్షన్‌ను చెన్నైలో జరపాలని ఆమె నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం ఆమె చెన్నైలో ఉండటమే. దీంతో తన కొడుకుకోడళ్లను అక్కడకు తీసుకెళ్లి రిసెప్షన్ నిర్వహించాలనే భావనలో ఆమె ఉన్నారట. ఈ నెలాఖరులోగానే ఈ వేడుక జరగనుంది. ఈ ఫంక్షన్‍‌కు దగ్గుబాటి బంధుగణమంతా తరలి వెళ్లనుంది. 
 
మరోవైపు, హైదరాబాద్‌లో కూడా భారీ ఎత్తున ఈ రిసెప్షన్ కార్యక్రమం జరుగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి ఘనంగా నిర్వహించాలని నాగ్ డిసైడ్ అయ్యారు. నవంబర్ మొదటి వారంలో జరగనున్న ఈ రిసెప్షన్ కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. కాగా, నాగచైతన్య, సమంతల వివాహం రెండు సార్లు అంటే హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహం జరిగిన విషయం తెల్సిందే.