శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (10:37 IST)

సమంత, నాగచైతన్యకు సరిగ్గా ఆ టైమ్‌కి రింగులు పంపిన పవన్, త్రివిక్రమ్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రంలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత, నాగచైతన్య వివాహ సమయానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సర్ ప్రైజ్ ఇచ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రంలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత, నాగచైతన్య వివాహ సమయానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంతల వివాహం గోవాలోని డబ్ల్యూ హోటల్‌లో అక్టోబర్‌ 6న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో కొత్త దంపతులకు సమంత, నాగచైతన్యకు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. సరిగ్గా వివాహ సమయానికి వారిద్దరికీ ఉంగరాలు అందేలా పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. ఆ ఉంగరాలను చూసిన సమంత, చైతూ హ్యాపీగా ఫీలయ్యారట. ఈ ఉంగరాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారని తెలుస్తోంది.
 
తొలుత ఈ ఉంగరాలను హైదరాబాదులో నిర్వహించనున్న రిసెప్షన్‌లో ఇవ్వాలనుకున్నారట. అయితే వివాహం సమయానికి ఇస్తేనే బాగుంటుందని భావించి.. ఇలా సర్‌ప్రైజ్ ఇచ్చారని టాక్. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.