శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (12:12 IST)

పవన్ కళ్యాణ్‌కు పుత్రోత్సాహం... లెజ్నోవాకు మగబిడ్డ

హీరో, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మరోమారు తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజ్నోవా రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే.

హీరో, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మరోమారు తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజ్నోవా రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే. 
 
పవన్ కల్యాణ్ తొలి భార్యకు పిల్లలు లేకపోగా, రెండో భార్య, సినీ నటి రేణూ దేశాయ్‌తో బాబు (అకీరా), ఒక పాప (ఆద్య)కు తండ్రి కాగా, తర్వాత మూడో వివాహం చేసుకున్న అన్నా లెజ్నోవాకు గతంలో పాప పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దంపతులకు బాబు పుట్టాడు. 
 
డెలివరీ సమయంలో ఆస్పత్రిలోనే ఉన్న పవన్ కళ్యాణ్ అపుడే పురిటి బిడ్డను ఎత్తుకుని తదేకంగా చూస్తున్నపుడు తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇపుడు వైరల్ అయింది.