శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (14:43 IST)

నిజానికి మా పెళ్లి ఎప్పుడో జ‌రిగిపోయింది అంటున్న సమంత

టాలీవుడ్ ప్రేమ జంట నాగచైతన్య, సమంతలు ఈనెల ఆరు, ఏడు తేదీల్లో ఓ ఇంటివారయ్యారు. తొలి రోజున హిందూ సంప్రదాయం ప్రకారం, రెండో రోజున క్రైస్తవ విధానంలో పెళ్లి చేసుకున్నారు. గోవాలో జరిగిన ఈ పెళ్లి ఇరు కుటుంబాల

టాలీవుడ్ ప్రేమ జంట నాగచైతన్య, సమంతలు ఈనెల ఆరు, ఏడు తేదీల్లో ఓ ఇంటివారయ్యారు. తొలి రోజున హిందూ సంప్రదాయం ప్రకారం, రెండో రోజున క్రైస్తవ విధానంలో పెళ్లి చేసుకున్నారు. గోవాలో జరిగిన ఈ పెళ్లి ఇరు కుటుంబాల సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. 
 
ఈ వివాహం గురించి స‌మంత ఓ జాతీయ పత్రిక‌తో మాట్లాడింది. "పెళ్లికి వ‌చ్చిన‌వారంద‌రినీ సంతోషంగా ఉంచాల‌ని నేను, చై అనుకున్నాం. పెళ్లి గ్రాండ్‌గా చేసుకుంటే అతిథుల‌ను ప‌ట్టించుకునే వీలుండ‌దు. నా వివాహం నాకు బాగా ద‌గ్గ‌రైన వారి స‌మ‌క్షంలోనే జ‌ర‌గాల‌ని ఎప్పుడో అనుకున్నా. నిజానికి మా పెళ్లి ఎప్పుడో జ‌రిగిపోయింది. ఇప్పుడు జ‌రిగింది సంప్ర‌దాయం కోస‌మేన"ని చెప్పింది స‌మంత‌. కాగా, వీరిద్దరు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న విషయం తెల్సిందే.