మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 31 మే 2024 (17:46 IST)

వామ్మో... అగ్నిగుండంలా నాగ్‌పూర్: 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Heat temperature
దేశంలో భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈరోజు దేశంలోనే అత్యంత అధిక ఉష్ణోగ్రత మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో నమోదైంది. నాగ్‌పూర్ లోని ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండి కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సోనేగావ్ లోని ఏడబ్ల్యూఎస్ కేంద్రంలో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
 
ఢిల్లీలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత
ఢిల్లీలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రాజధాని ఢిల్లీలోని ముంగేష్‌పూర్ ప్రాంతంలో బుధవారం అత్యంత వేడిగా ఉంది. ఇక్కడ 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం అంటే నిన్న ముంగేష్‌పూర్‌లో 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ ఇప్పటికే బుధవారం మే 29 హీట్, హీట్ వేవ్ గురించి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంగేష్‌పూర్ వాతావరణ కేంద్రంలో అత్యధికంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం అధిపతి తెలిపారు.
 
పదేళ్లలో ఢిల్లీలో ఉష్ణోగ్రత 7 డిగ్రీలు మేర పెరిగింది
ఢిల్లీ హీట్ ఐలాండ్స్ నగరంగా మారింది. గత దశాబ్దంలో, రాజధాని ఉష్ణోగ్రత సగటున ఏడు డిగ్రీల సెల్సియస్ పెరిగింది. మే 2014లో సాధారణంగా 30-33 డిగ్రీల వేడి ఉండే ఢిల్లీ, మే 2024లో 40 డిగ్రీల దాకా వచ్చేసింది. జూన్ మొదటి వారం వరకు ఢిల్లీలో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు వుంటాయని అంచనా.
 
మే నెలలో ఢిల్లీ ఉష్ణోగ్రతపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ పరిశోధన చేసింది. మే 2014లో ఢిల్లీ సగటు ఉష్ణోగ్రత 30-33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కాగా ఇందులో కూడా చాలా ప్రాంతాలు ఉత్తర, నైరుతి ఢిల్లీ శివార్లలో ఉండేవి. దీనికి విరుద్ధంగా 2022లో, ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది. ఇలా క్రమేణా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తోంది.