శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (11:31 IST)

దేశంలో భగ్గుమంటున్న ఎండలు.. ఆ రాష్ట్రాల్లో వడగాల్పులు

heat wave
దేశంలో ఎండలు భగ్గుమంటున్నాయి. వివిధ రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ కు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో వచ్చే నాలుగు రోజులపాటు వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. 
 
మరోవైపు జమ్మూ, కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అరెంజ్ అలర్ట్ విడుదల చేసింది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్‌లలో కూడా వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ పేర్కొంది. 
 
ఉత్తరాఖండ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్ గఢ్, ఒడిశాలోని దక్షిణ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని ఐఎండీ అంచనా వేసింది. కేరళలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.