గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (10:02 IST)

దీప చేసిన హంగామా.. పోయెస్ గార్డెన్‌కు కళ వచ్చేసింది... అమ్మ వున్నప్పుడే ఎలా వుండేదో?

జయ మేనకోడలు దీప పుణ్యంతో ప్రస్తుతం పోయెస్‌గార్డెన్ ప్రాంతంలో దివంగత సీఎం జయలలిత నివసించిన విధంగా పోలీసులు కాపలా కాస్తున్నారు. ఆదివారం ఉదయం తన తమ్ముడు దీపక్ ఆహ్వానించారంటూ వేద నిలయానికి వెళ్లిన కాసేపటి

జయ మేనకోడలు దీప పుణ్యంతో ప్రస్తుతం పోయెస్‌గార్డెన్ ప్రాంతంలో దివంగత సీఎం జయలలిత నివసించిన విధంగా పోలీసులు కాపలా కాస్తున్నారు. ఆదివారం ఉదయం తన తమ్ముడు దీపక్ ఆహ్వానించారంటూ వేద నిలయానికి వెళ్లిన కాసేపటికి తనపై దీపక్ అనుచరులు దాడి చేశారంటూ ప్రకటించింది. దీప గొడవతో ఉలిక్కిపడిన పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వెళ్లారు. 
 
దీపను శాంతింపజేసి ఇంటికి పంపారు. దీనితో సోమవారం ఉదయం నుంచి వేదనిలయం వద్ద గట్టి పోలీసు భద్రత ఏర్పాటైంది. పోయెస్‌ గార్డెన్‌ రహదారికి ఇరువైపులా మళ్లీ పోలీసు అసిస్టెంట్‌ కమిషనర్ల నాయకత్వంలో ఇనుపబారికేడ్లు ఏర్పాటు చేసి తలా పదిమంది కానిస్టేబుళ్లు రహదారికి ఇరువైపలా డ్యూటీ చేస్తూ వాహనాల రాకపోకలను క్రమబద్దీకరణ చేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్లే పాదచారులను సైతం విచారణ జరిపిన మీదటే అనుమతిస్తున్నారు
 
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అధికారిక నివాసం పోయెస్‌గార్డెన్‌ వేద నిలయం వద్ద రెండంచెల పోలీసు భద్రత అమలులోకి వచ్చింది. 50మంది పోలీసులు ఆ ప్రాంతంలో కాపలా కాస్తున్నారు. జయలలిత సోదరుడి కుమార్తె దీప ఆదివారం ఆ నివాసగృహం వద్ద నానా హడావుడి చేయడంతో నాలుగు మాసాలుగా నిర్మానుష్యంగా కొనసాగిన ఆ ప్రాంతం ప్రస్తుతం పోలీసుల రక్షణవలయంలోకి వచ్చింది. 
 
జయ మృతి తర్వాత వేదనిలయంలో ఆమె సన్నిహితురాలు శశికళ బసచేశారు. అక్రమార్జన కేసులో సుప్రీంకోర్టు బెంగుళూరు ప్రత్యేక కోర్టు శశికళకు విధించిన జైలుశిక్షను ఖరారరు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనితో శశికళ గత ఫిబ్రవరి మూడో వారంలో బెంగుళూరు పరపన అగ్రహారం జైలులో ఉన్నారు.