బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (18:31 IST)

మోదీ-యోగికి అత్యాచార బాధితురాలి రక్తపు లేఖ.. అలా జరగకపోతే..?

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులను నియంత్రించేందుకు కఠినమైన శిక్షలు అమలు కావట్లేదని మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అత్యాచార బాధితురాలు తనక

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులను నియంత్రించేందుకు కఠినమైన శిక్షలు అమలు కావట్లేదని మహిళా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అత్యాచార బాధితురాలు తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఓ లేఖ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లకు తెలియజేసింది. 
 
ఆ లేఖను రక్తంతో రాసి పంపింది. తన జీవితాన్ని నాశనం చేసిన కామాంధులకు శిక్షపడేలా చేయాలని వేడుకుంది. ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని.. నిందితులకు పెద్ద మనుషుల అండ వుండటంతో కేసును వెనక్కి తీసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు ఆ లేఖలో పేర్కొంది. ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేసింది. 
 
ఇకపోతే... గ‌తేడాది మార్చి 24న దివ్యా పాండే, అంకిత్ వ‌ర్మ‌లు త‌న కూతురిని రేప్ చేశారంటూ బాధితురాలి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇంకా పోలీసులు, రేపిస్టుల వేధింపులు అధికమవుతున్నాయని బాధితురాలు వాపోయింది.