శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 నవంబరు 2017 (17:27 IST)

అధికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో అనేక మార్పులు తీసుకొస్తాం: రాహుల్ గాంధీ

జీఎస్టీలో మార్పులు అవసరమని.. తాము అదికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో అనేక మార్పులు తీసుకొస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారం ఉదయం కాంగ్రెస్ పార్

జీఎస్టీలో మార్పులు అవసరమని.. తాము అదికారంలోకి వస్తే జీఎస్టీ విధానంలో అనేక మార్పులు తీసుకొస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహించింది. 
 
ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌ను సుధీర్ఘకాలం పాలించిన బీజేపీ ప్రజలకు ఒరుగబెట్టిందేమీ లేదని ఆయన విమర్శించారు.
 
 28 శాతం శ్లాబ్‌లో ఉన్న కొన్ని వస్తువులను 18 శాతం శ్లాబ్‌కు మార్చడం కాంగ్రెస్ ఒత్తిడి వల్లే జరిగిందని రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. ప్రస్తుత శ్లాబ్ విధానం ప్రజలకు సంతోషకరంగా లేదని.. ఐదు రకాల ట్యాక్స్‌లు వేయడం సరికాదని రాహుల్ గాంధీ సూచించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జీఎస్టీలో మార్పులు చేస్తామన్నారు.