ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (07:52 IST)

అది పవన్ కు సంబంధించిన సినిమా కాదు బాబోయ్.. వర్మ

అది పవన్ కల్యాణ్ కథతో కూడిన సినిమా కాదంటే ఎవ్వరూ నమ్మరేంటండి బాబోయ్' అంటూ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మొత్తుకుంటున్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రామ్ గోపాల్ వర్మ ఆఫీసుపై  ఓయూ జేఏసీ విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే.
 
ఈ దాడిపై రామ్‌ గోపాల్ వర్మ స్పందించారు. "పని లేని వాళ్లు కాసేపు అరిస్తే పబ్లిసిటీ వస్తుంది. అందుకే నా ఆఫీసుపై దాడి చేశారు. దాడి చేసిన వాళ్లు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని  నేను చెప్పను. జనసేన, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎవరో నాకు తెలియదు. చాలామంది పనిలేని వాళ్లు ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్లను పోలీసులు తీసుకెళ్లారు"  అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. 

‘పవర్ స్టార్’ అనే సినిమా పవన్ కల్యాణ్‌కు సంబంధించిన సినిమా కాదని ఇప్పటికే చాలా సార్లు చెప్పానన్నారు. అది కేవలం కల్పిత సినిమా మాత్రమేనన్నారు. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఏ ఇంటర్వ్యూలోనూ తాను చెప్పలేదని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. కాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘పవన్ స్టార్’ జులై 25న ఓటీటీలో విడుదల కానుంది.