శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 జనవరి 2017 (11:20 IST)

రాష్ట్రపతి ఆమోదముద్ర లేకనే.. తిరుచ్చిలో జల్లికట్టు ఉత్సవాలు.. 300 ఎద్దులను అలంకరించి?

తమిళనాడులో జల్లికట్టు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే సుప్రీం కోర్టు తీర్పు ఇంకా రాలేదు. తమిళనాడులోని జల్లికట్టు చట్టానికి రాష్ట్రపతి ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. రాష్ట్రంలో మాత్రం అక్కడక్కడ జల్

తమిళనాడులో జల్లికట్టు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే సుప్రీం కోర్టు తీర్పు ఇంకా రాలేదు. తమిళనాడులోని జల్లికట్టు చట్టానికి రాష్ట్రపతి ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. రాష్ట్రంలో మాత్రం అక్కడక్కడ జల్లికట్టు మొదలైంది. తిరుచ్చి జిల్లా కురుంగుళంలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. జల్లికట్టును వ్యతిరేకించబోమని యానిమల్ వెల్‌ఫేర్ బోర్డు హామీ ఇచ్చిన తర్వాత గ్రామీణ క్రీడ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.
 
శనివారం ప్రత్యేకంగా సమావేశమైన జల్లికట్టు నిర్వాహక కమిటీ ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రజలు గాయపడకుండా చూసేందుకు 150 మంది వాలంటీర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 
 
300 ఎద్దులను అందంగా అలంకరించి జల్లికట్టుకు తరలించారు. కాగా ఇప్పటికే 'జల్లికట్టు' క్రీడను చట్టబద్ధం చేసేందుకు తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ముసాయిదా బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ విద్యాసాగర్‌ రావు పంపారు.