గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2024 (09:40 IST)

దశాబ్దం తర్వాత జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

jammu-kashmir
పదేళ్ల తర్వాత జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరుగుతుంది. తొలి దశలో 24 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగతుంది. తొలి దశ ఎన్నికల్లో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 23 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్‌పోరా, జైనాపోరా, షాపియన్, డి.హెచ్.పోరా, కుల్గాం, దేవ్‌సర్, దూరు, కోకెన్‌నాగ్, అనంతనాగ్ వెస్ట్, అనంతనాగ్, శ్రీగుఫ్వారా - బిజ్‌బెహరా, షాంగస్, అనంతనాగ్ ఈస్ట్, పహల్గాం, ఇండెర్వాల్, కిష్త్‌వార్, పాడర్ నాగ్‌సేని, భదర్వా, దోడా, దోడా వెస్ట్, రాంబన్, బనిహాల్ స్థానాల్లో తొలి విడత ఎన్నికలు జరుగనున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో మూడు విడుతల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.