సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (11:48 IST)

వ్యవసాయ సహకార బ్యాంకులో రూ.15 కోట్లు మాయం.. బ్యాంకు మేనేజరు సూసైడ్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులో రూ.15కోట్ల మేరకు నిధులు గల్లంతయ్యాయి. దీంతో బ్యాంకు మేనేజరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
రాష్ట్రంలోని ఖండేల్వాల్ నగర్‌లోని తన ఇంట్లో కుశ్వాహా ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులో పని చేస్తున్నాడు. ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సున్నా శాతం వడ్డీ రేటుతో రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి మక్డాన్ శాఖలో అక్రమాలు వెలుగు చూశాయి. 
 
మొత్తం ఎనిమిది ఏఈఎసిల ద్వారా రుణాల పంపిణీకి సంబంధించిన పోర్టల్‌లో అప్‌లోడ్ సబ్సిడీ షీట్‌లో సుమారు రూ.15 కోట్ల వరకు తేడా వచ్చింది. దీనిపై పై అధికారులు వివరణ కోరారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, శ్రీవాస్తవ  కుశ్వాహాకు నోటీసులు జారీ చేశారు. 
 
బహుశా ఈ విషయంలో అతను ఒత్తిడికిలోనై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్‌నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టామనీ, విచారణ పూర్తయిన తర్వాత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తామన్నారు.
 
ఈ సూసైడ్ నోట్‌లో బ్యాంకు ఎండీ విశేష్ శ్రీవాస్తవ, అసిస్టెంట్ మేనేజర్హే‌ మహేష్ కుమార్ మాథుర్ పేర్లను పేర్కొన్నాడు. తమ అక్రమాలకు, అవినీతికి సహకరించాలంటూ ఉన్నతాధికారులు తనను వేధించారంటూ ఆ లేఖలో పేర్కొనడం కలకలం రేపింది. 
 
మరోవైపు ఈ విషయంలో గత ఆరు నెలలుగా తండ్రి మానసిక వేదన అనుభవించాడని కుమారుడు నరేంద్ర చెప్పారు. బ్యాంకులో అవినీతికి పాల్పడటం ద్వారా తమకు డబ్బులు ఇవ్వమని ఎండీ, ఇతర ఉన్నతోద్యోగుల నుంచి ఒత్తిడి ఉండేదని ఆరోపించారు.