12ఏళ్లు డ్యూటీ చేయని కానిస్టేబుల్.. జీతం మాత్రం రూ.28లక్షలు తీసుకున్నాడు..
2011లో మధ్యప్రదేశ్ పోలీస్ విభాగంలో ఓ కానిస్టేబుల్ నియమాకం అయ్యారు. మొదట భోపాల్ పోలీస్ లైన్స్‌లో నియమించబడ్డారు. తర్వాత భోపాల్‌కు వేశారు. కానీ అతని సర్వీస్ ఫైల్‌ను స్పీడ్ పోస్ట్ ద్వారా భోపాల్‌కు పంపాడు. ఆ ఫైల్ అక్కడికి చేరుకుంది. ఎటువంటి దర్యాప్తు లేకుండానే ఆమోదించబడింది. భోపాల్ పోలీస్ లైన్‌లో ఎవరూ అతని గైర్హాజరీని పట్టించుకోలేదు. ఈ విధంగా అతను విధులకు హాజరు కాకుండానే ఏడాది తర్వాత ఏడాది ఇలా 12 ఏళ్లుగా జీతం పొందుతూనే ఉన్నాడు.
ఇలా మధ్యప్రదేశ్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో 12 సంవత్సరాలుగా డ్యూటీ చేయకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్నాడు. ఆ కానిస్టేబుల్ ను ఉన్నాతాధికారులు విచారణకు పిలువగా.. తాను మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, అందువల్ల విధులకు హాజరు కాలేదన్నాడు.
కొన్ని రిపోర్టులను కూడా అధికారులకు అందించాడు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్‌ను భోపాల్ పోలీస్ లైన్‌లో ఉంచారు. అతని నుండి రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని అతని రాబోయే జీతం నుండి కట్ చేస్తామన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.