మహా కుంభమేళాలో మహిళలు స్నానం చేసే వీడియోలను అమ్ముకుంటున్నారు..
మహా కుంభమేళాలో మహిళలు స్నానం చేసే వీడియోలను పోర్న్ గ్రాఫీ సైట్లు క్యాష్ చేసుకుంటున్నారు. కుంభమేళాలో స్నానాలు చేస్తున్న అమ్మాయిల వీడియోలు అంటూ అమ్ముకుంటున్నారు.
కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో మహిళలు స్నానాలు చేస్తున్న సమయంలో, వాళ్లు బట్టలు మార్చకుంటున్న సమయంలో దొంగచాటుగా వీడియోలు తీసి.. వాటిని అశ్లీల వీడియోల సైట్లలో, టెలిగ్రామ్ ఛానల్స్‌లో అమ్ముకుంటున్నారు.
టెలిగ్రామ్‌లో ఇప్పటికే అనేక వీడియోలు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కుంభమేళాలో పాల్గొన్న చాలా మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు.
దీనిపై సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ కథనాలు రావడంతో పోలీసులు కూడా స్పందించారు. డీఐజీ వైభవ్ కృష్ణ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "వీడియోలు పోస్ట్ చేసిన టెలిగ్రామ్ ఛానెల్స్‌ను గుర్తించే పనిలో ఉన్నాం. అలాగే వీడియోలు రికార్డ్ చేసి అమ్మకానికి పెట్టిన వారిని పట్టుకొని ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తాం" అని తెలిపారు.