ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (09:20 IST)

అప్పు చెల్లించలేక పోవడంతో కుమార్తెను వ్యభిచారం చేయమన్న తల్లి

చేసిన అప్పు తీర్చలేని తల్లిదండ్రులు కూతుర్ని ఆ అప్పులోడికి అప్పగిస్తున్నారు. ప్రస్తుతం అందరూ ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... మహా

చేసిన అప్పు తీర్చలేని తల్లిదండ్రులు కూతుర్ని ఆ అప్పులోడికి అప్పగిస్తున్నారు. ప్రస్తుతం అందరూ ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... మహారాష్ట్రలోని మన్పాడకు చెందిన ఆంటోని జోసెఫ్‌ సామ్యూల్‌(30) నుంచి ఓ మహిళ తన కుమార్తె ద్వారా రూ.10 వేల అప్పు తీసుకుంది. సకాలంలో ఆ మహిళ డబ్బు చెల్లించలేదు. 
 
దీంతో ఆంటోని మహిళపై డబ్బులివ్వాలని ఒత్తిడి చేశాడు. లేదంటే కుమార్తెపై యాసిడ్ దాడి చేసి.. ఆమె భర్తను హత్య చేస్తానని బెదిరించాడు. దీంతో మహిళ ఆంటోనిని ఇంటికి పిలిచింది. అతడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని అప్పుడే అప్పు మాఫీ అవుతుందని కుమార్తెను బలవంతపెట్టింది. దీంతో కుమార్తెను ఇంటిలో ఉంచి బయట గడియపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆంటోనిపై అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.