వార్నీ ఎంత పనిచేశాడు.. ప్రైవేట్ ఫోటోను వాట్సాప్‍లో షేర్ చేశాడు.. ఫ్యామిలీ పరార్
సామాజిక వెబ్ సైట్లలో ఒకటైన వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వయోభేదాలు లేకుండా వాట్సాప్ అందరూ ఉపయోగిస్తున్నారు. అత్యుత్తమ మెసెంజర్‌గా ఉపయోగపడుతున్న వాట్సాప్‌లో గ్రూప్ చాట్ చేసే సదుప
సామాజిక వెబ్ సైట్లలో ఒకటైన వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వయోభేదాలు లేకుండా వాట్సాప్ అందరూ ఉపయోగిస్తున్నారు. అత్యుత్తమ మెసెంజర్‌గా ఉపయోగపడుతున్న వాట్సాప్‌లో గ్రూప్ చాట్ చేసే సదుపాయం కూడా ఉంది. ఫ్రెండ్స్ సర్కిల్, ఆఫీస్ సర్కిల్ వంటి పలు గ్రూపుల్లో చాటింగ్, ఫోటో షేరింగ్ చేసుకోవచ్చు. అలా ఓ కుటుంబ గ్రూపులో పోస్టు చేసిన ఈ ఘటన.. పబ్లిక్ మీడియాకు తెలియవచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఆశిషీ మెహ్రోత్రా అనే వ్యక్తి తన ట్విట్టర్ పేజీలో పెట్టిన ఓ అభ్యంతరకర పోస్టే ఇందుకు కారణమైంది. అందులో అతని మామ ప్రైవేట్ ఫోటో తీసి.. చూసుకోకుండా కుటుంబ గ్రూపులో పోస్ట్ చేసేశాడు. దీంతో కుటుంబంలో అందరూ ఈ పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంట వెంటనే ఆ గ్రూపు నుంచి అందరూ తొలగిపోయారు. ఇలా ఆ కుటుంబ సభ్యులు వాట్సాప్ గ్రూపు నుంచి పారిపోయారు.