ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2017 (10:58 IST)

16ఏళ్ల అమ్మాయిని వేధించాడు.. ఆ సంబంధం పెట్టుకోవాలన్నాడు.. ఆపై?

16 ఏళ్ల అమ్మాయిని మరో యువకుడు వేధింపులకు గురిచేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రోజూ తన వెంటపడుతూ.. ఈవ్ టీజింగ్ చేయడమే కాకుండా తనతో సంబంధం పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి

16 ఏళ్ల అమ్మాయిని మరో యువకుడు వేధింపులకు గురిచేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రోజూ తన వెంటపడుతూ.. ఈవ్ టీజింగ్ చేయడమే కాకుండా తనతో సంబంధం పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే అహ్మదాబాద్, పరిశిలోని వస్త్రాల్ ప్రాంతానికి చెందిన సంకేత్ చౌదరి అనే యువకుడు ఓ యువతిని వేధించాడు. 
 
తాను తండ్రి కారులో కళాశాలకు వెళుతుండగా అడ్డుకొని ఈవ్ టీజింగ్ చేసేవాడు. ఇలా యువకుడు వేధిస్తుండగా ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టింది. దాంతో ఆ ఫోటోలు కాస్తా వైరల్ అయ్యాయి. తన కుమార్తెను సంకేత్ వేధిస్తున్నాడని అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినా అతను తల్లిదండ్రుల నియంత్రణలో లేడని బాలిక తండ్రి వెల్లడించారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. 
 
తన బిడ్డనే కాకుండా సంకేత్ అతడి బంధువుల అమ్మాయిని కూడా ఇలాంటి వేధింపులకు గురిచేశాడని పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఇంకా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని.. కేసును దర్యాప్తు చేస్తున్నారని బాధితురాలి తండ్రి వెల్లడించారు.