శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 జులై 2017 (11:20 IST)

చపాతీలు గుండ్రంగా లేవని.. 4 నెలల గర్భిణీని కొట్టి చంపేసిన భర్త.. కుమార్తెను?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై ముక్కూ మొహం తెలియని వ్యక్తులే కాదు.. ఇంట్లో వుండే పురుషులు కూడా హింసిస్తున్నారు. అంతేకాదు.. చిన్న చిన్న విషయాలకే కట్టుకున్న భార్యలను చంపేస్తున్నారు. తా

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై ముక్కూ మొహం తెలియని వ్యక్తులే కాదు.. ఇంట్లో వుండే పురుషులు కూడా హింసిస్తున్నారు. అంతేకాదు.. చిన్న చిన్న విషయాలకే కట్టుకున్న భార్యలను చంపేస్తున్నారు. తాజాగా భార్య చేసిపెట్టిన చపాతీలు గుండ్రంగా లేవని కట్టుకున్న భార్యనే ఓ దుర్మార్గుడు కడతేర్చాడు. ఈ ఘటన ఢిల్లీలోని జహంగిర్‌పురిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే శనివారం వేకువ జామున 4 గంటల సమయంలో బాధిత మహిళ సోదరుడు పోలీసులకు ఫోన్ చేశాడు. తన సోదరి అపస్మారక స్థితిలో తన ఫ్లాట్‌లో పడి ఉందని, ఆమె నాలుగేళ్ల కుమార్తెను ఓ గదిలో బంధించారని పోలీసులకు చెప్పాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాధిత మహిళ సిమ్రన్‌‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇంకా సిమ్రన్ నాలుగు నెలల గర్భిణి అని పోలీసులు తెలిపారు. 
 
చపాతీల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతుండేవారని, అవి గుండ్రంగా లేవన్న కారణంతో తన తండ్రి కోపగించుకున్నాడని సిమ్రన్ నాలుగేళ్ల కుమార్తె పోలీసులకు తెలిపింది. శనివారం రాత్రి కూడా తల్లిదండ్రుల మధ్య చపాతీల విషయంలో భార్యాభర్తలు గొడవపడ్డారని.. ఈ క్రమంలో సిమ్రన్‌పై భర్త దాడి చేశాడని.. తండ్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిమ్రన్ కూతుర్ని గదిలోకి తీసుకెళ్లిన నిందితుడు బయట గొళ్లెం పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.