శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2024 (22:43 IST)

గ్రేటర్ నోయిడా: వరకట్నం కోసం కట్టుకున్న భార్యను కాల్చి చంపేశాడు..

gunshot
గ్రేటర్ నోయిడాలోని దన్‌కౌర్ ప్రాంతంలో కట్నం కోసం ఓ మహిళను ఆమె భర్త కాల్చిచంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న భర్త, అత్తమామల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే, జగన్‌పూర్ గ్రామానికి చెందిన తన భర్త దీపక్ భరదానా, అత్తమామలతో కలిసి తన కుమార్తెను కాల్చిచంపారని బాధితురాలి తండ్రి ఆగస్టు 24న దంకౌర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వరకట్నం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, కొద్దిరోజుల క్రితమే తన కూతురు తమ ఇంటికి తిరిగి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.