బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: మంగళవారం, 30 అక్టోబరు 2018 (22:08 IST)

డిసెంబరు 12న ఘనంగా ఇషా అంబానీ, ఆనంద్ పిరమళ్ వివాహం

ఇషా అంబానీ, ఆనంద్ పిరమళ్ వివాహం శ్రీ ముఖేష్ అంబానీ, శ్రీమతి నీతా అంబానీ నివాసంలో అంగరంగ వైభవంగా జరుపనున్నారు. వీరి వివాహం 12 డిసెంబరు 2018న జరుగనుంది. ఈ వేడుకలు భారతీయ సంప్రదాయాలు మరియు సంస్కృతికి అద్దం పట్టేలా నిర్వహించనున్నారు.
 
వివాహానికి ముందు వారాంతంలో, అంబానీ మరియు పిరమళ్ కుటుంబాలు వారి స్నేహితులకు ఉదయపూర్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ కాబోయే వధూవరులకు వచ్చిన అతిథులకు తమ దీవెనలు, ఆశీస్సులు అందజేస్తారు. కాగా అక్కడ స్థానిక సంస్కృతి మరియు సాంప్రదాయాలను అనుసరిస్తూ సంబురాల వాతావరణంలో కళాకారులతో ఈ వేడుక అత్యంత ఘనంగా చేయనున్నారు. ఈ వేడుకకు విచ్చేసి ఇషా, ఆనంద్‌లను దీవించాలని నీతా మరియు ముఖేష్ అంబానీ, స్వాతి మరియు అజయ్ పిరమల్ కోరుతున్నారు.