శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (12:54 IST)

ఆ హీరోకు ఏం పోయేకాలం? భావన వేధింపు వెనుకు భారీ కుట్ర!

మగాడి కాటుకు గురైన ప్రముఖ మలయాళ కథానాయిక భావనకు చిత్రపరిశ్రమనుంచే కాకుండా యావత్ దేశం నుంచే మద్దతు లభిస్తోంది. కానీ కాటేసిన ఆ మగాడు మాజీ డ్రైవర్ కాదు.. మల్లువుడ్ లోని ప్రముఖ హీరో అని పోలీసులు అనుమానం వ

మగాడి కాటుకు గురైన ప్రముఖ మలయాళ కథానాయిక భావనకు చిత్రపరిశ్రమ నుంచే కాకుండా యావత్ దేశం నుంచే మద్దతు లభిస్తోంది. కానీ కాటేసిన ఆ మగాడు మాజీ డ్రైవర్ కాదు.. మల్లువుడ్ లోని ప్రముఖ హీరో అని పోలీసులు అనుమానం వ్యక్తం చేయడంతో దక్షిణాది చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి చెందుతోంది. భావనపై దాడి చేసిన వెంటనే డ్రైవర్ రూపంలోని రౌడీ షీటర్ సునీల్ కుమార్ మలయాళ సినీ పరిశ్రమలోని కొంతెమందితో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించడంతో ఈ ఘటన వెనుక భారీ కుట్ర ఉందని అనుమానం బలపడతుతోంది. 
 
ప్రముఖ మలయాళ కథానాయికపై లైంగిక దాడి కేసులో సినీ ప్రముఖుల హస్తం ఉందన్న అనుమానం సాక్షాత్తూ పోలీసులే వ్యక్తం చేస్తున్నారు. భావనను చిత్రపరిశ్రమలో లేకుండా చేయాలనే ఆలోచనతో రౌడీ షీటర్‌ సునీల్‌ కుమార్‌తో కుమ్మక్కై వాళ్లే ఈ పని చేయించారా! వృత్తిపరమైన శత్రుత్వమే ఇందుకు కారణమా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నామని కేరళ క్రైంబ్రాంచ్‌ ఐజీ దినేంద్ర కశ్యప్‌ తెలిపారు. ఇందుకు కారణం లేకపోలేదు. కథానాయికపై దాడి చేసిన తర్వాత సునీల్‌ కుమార్‌ సినీ పరిశ్రమలోని కొంతమందితో ఫోన్లో మాట్లాడాడు. ఈ మేరకు పోలీసులకు ఆధారాలు లభించాయి. దాంతో, సినీ పరిశ్రమలోని కొంతమంది జోక్యం సహా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని ఐజీ తెలిపారు. 
 
కాగా, భావనపై లైంగిక దాడి వెనక నేరపూరిత కుట్ర ఉందని మరో నటి మంజు వారియర్‌ ఆరోపించారు. అది కూడా, ఈ ఘటనకు వ్యతిరేకంగా మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలోనే ఆమె ఈ విమర్శలు చేశారు. అలాగే, ‘‘కేరళ సినీ పరిశ్రమ మాఫియా గుప్పిట్లో ఉంది. లైంగికదాడికి గురైన హీరోయిన్‌కు ఓ హీరోతో వైరం ఉంది. దాంతో ఆమె చిత్రపరిశ్రమలో వివక్షకు గురవుతోంది. ఆ హీరోతో శత్రుత్వానికి, దాడికి ఏమైనా సంబంధం ఉందేమో విచారించాలి’’అని బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు వి.మురళీధరన్‌ వ్యాఖ్యానించారు. 
 
పరారీలో ఉన్న సునీల్‌ కుమార్‌ను పట్టుకునేందుకు లుకవుట్‌ నోటీసు జారీచేశారు. విచిత్రం ఏమిటంటే, ప్రధాన నిందితుడు సునీల్‌ సహా మొత్తం ముగ్గురు తమకు ముందస్తు బెయిల్‌ కావాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. హీరోయిన్‌ డ్రైవర్‌ వాంగ్మూలం ఆధారంగా తమను ఈ కేసులో ఇరికిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది. 
 
ఇక, ఇప్పటికే అరెస్టు చేసిన హీరోయిన్‌ డ్రైవర్‌ మార్టిన్‌ ఆంటోనీని పోలీసులు విచారిస్తున్నారు. లైంగిక దాడి ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేయాలని, రూ.30 లక్షలు వసూలు చేయాలని కుట్రపన్నామని విచారణలో అతడు తెలిపాడు. సినీ వర్గాల చుట్టూ తిరిగే సునీల్‌ కుమార్‌ గతంలోనూ కిడ్నాప్‌లకు పాల్పడినట్లు వెలుగులోకి వస్తోంది. గతంలో సునీల్‌ కుమార్‌ తన భార్యను కిడ్నాప్‌ చేయబోయాడని, త్రుటిలో ఆమె తప్పించుకుందని నిర్మాత సురేశ్‌కుమార్‌ చెప్పారు. ఇక, దోషులను కఠినంగా శిక్షించాలని సినీ పరిశ్రమ ఆందోళనలు నిర్వహిస్తోంది. సాధ్యమైనంత త్వరగా దోషులను శిక్షించాలని దక్షిణ భారత ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(ఎస్‌ఐఏఏ) డిమాండ్‌ చేసింది. దేశంలో మహిళలు ఎవరికీ భద్రతలేదని ఈ ఘటన తో స్పష్టమైందని సీఎంకు రాసిన లేఖలో పేర్కొంది.
 
కేరళ ముఖ్యమంత్రి సీఎం పినరయి విజయన్‌కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధిత హీరోయిన్‌తో మాట్లాడారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ ఆమెతో ఫోనులో మాట్లాడారు. కేంద్ర మాజీమంత్రి శశిథరూర్‌ భావన సాహసాన్ని కొనియాడారు.ఈ ఘటన భయానకమని, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలామంది గోప్యంగా ఉంచుతారని, కానీ ఆమె ధైర్యంగా పోరాడుతోందంటూ వ్యాఖ్యానించారు. 
 
తమిళ చిత్రపరిశ్రమ నుంచి కమల్ హసన్, శరత్ కుమార్, విశాల్ తదితరులు భావనపై లైంగిక దాడిని తీవ్రంగా ఖండించారు.