శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 మే 2017 (13:46 IST)

భారత రాష్ట్రపతిగా మోహన్ భగవత్ : శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రతిపాదన

భారత తదుపరి రాష్ట్రపతి ఎవరన్న దానిపై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీయే రెండోసారి పోటీలో ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమ

భారత తదుపరి రాష్ట్రపతి ఎవరన్న దానిపై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీయే రెండోసారి పోటీలో ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన శివసేన మాత్రం సరికొత్త పేరును తెరపైకి తెచ్చింది. సెక్యులర్ దేశమైన భారతదేశాన్ని పూర్తిగా హిందూదేశంగా మార్చాలనుకుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను తదుపరి రాష్ట్రపతిగా చేయాలని ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే సూచించారు. హిందూ రాజ్య స్థాపనే తమ ప్రథమ లక్ష్యమని, ఆ దిశగా కేంద్రం కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
ఒక్క కేంద్రంలోనే కాకుండా, దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీ లేదా బీజేపీ మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయని గుర్తుచేశారు. అందువల్ల భగవత్‌ను రాష్ట్రపతి ఎన్నికల్లో నిలపాలని కోరారు. ఈమేరకు తమ పార్టీ అధికార పత్రిక సామ్నాలోని కథనంలో... హిందూ దేశాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాగంగా మోహన్ భగవత్‌ను రాష్ట్రపతిని చేయాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భగవత్ స్పందించారు. తనకు రాష్ట్రపతి కావాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదని ఆయన తేల్చిచెప్పారు.