శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (13:21 IST)

National Ayurveda Day,, థీమ్, ప్రాముఖ్యత ఏంటంటే?

National Ayurveda Day
National Ayurveda Day
జాతీయ ఆయుర్వేద దినోత్సవం 2016 నుండి ప్రతి సంవత్సరం ధన్వంతరి జయంతి (ధంతేరస్) సందర్భంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 7వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని అక్టోబర్ 25, 2022న జరుపుకుంటున్నారు. ఇది వైద్యం, ఆయుర్వేద సూత్రాలను ప్రపంచానికి పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 
 
యువతరానికి ఆయుర్వేదంపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. ఈ సంవత్సరం, భారతదేశం "హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేద" అనే థీమ్‌తో ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
 
ఆయుర్వేదం అత్యంత పురాతనమైన వైద్య వ్యవస్థలలో ఒకటిగా గుర్తించబడింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ధన్వంతి జయంతి నాడు వచ్చే ఆయుర్వేద దినోత్సవాన్ని పాటించే విధానాన్ని ప్రారంభించింది. వేదాలు, పురాణాలు ధన్వంతరిని దేవతల వైద్యుడిగా ఆయుర్వేద దేవుడుగా పరిగణిస్తారు. 
 
అందుకే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేద జన్మదినాన్ని "జాతీయ ఆయుర్వేద దినోత్సవం"గా జరుపుకుంటుంది. జాతీయ ఆయుర్వేద దినోత్సవం ప్రధాన వేడుక న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది.