శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (12:35 IST)

విఘ్నాలు తొలగిపోవాలని కొరఢా దెబ్బలుతిన్న ముఖ్యమంత్రి!

bhupesh bhaghel
విఘ్నాలు తొలగిపోవాలని ఓ ముఖ్యమంత్రి ఏకంగా కొరఢా దెబ్బలు తిన్నారు. ఆ సీఎం ఎవరో కాదు.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్. దీపావళి వేడుకల్లో భాగంగా భాగంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కొరఢాతొ చేతిపై కొట్టించుకున్నారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని గ్రామస్థులు చెప్పడంతో ఆయన ఏమాత్రం ఆలోచన చేయకుండా కొరఢా దెబ్బలు తిన్నారు. 
 
దీపావళి వేడుకల్లో భాగంగా, ఆయన సోమవారం జజంగిరి పర్యటనకు వెళ్లారు. దుర్గ్ జిల్లాలో ఉన్న జజంగిరి గ్రామంలో గోవర్థన్ పూజ నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. 
 
ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా మిగతా భక్తులలాగే ముఖ్యమంత్రి కూడా కొరఢా దెబ్బలు తిన్నారు. దీనివల్ల శుభం కలుగుతుందని స్థానికుల నమ్మకం. ఈ నమ్మకాన్ని, ఆచారాన్ని సీఎం బాఘెల్ కూడా పాటించారు. ప్రతి యేటా దీపావళి పండుగ తర్వాత ఈ గోవర్థన్ పూజను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.