ఆడపిల్ల పుట్టిందని ఫోన్లో తలాక్ చెప్పిన భర్త.. ఎక్కడ?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌పై ముమ్మరంగా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆడపిల్ల పుట్టిందన్న అక్కసుతో భార్యకు తలాక్ చెప్పాడో భర్త. అదీ కూడా ఫోనులోనే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీల
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రిపుల్ తలాక్‌పై ముమ్మరంగా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆడపిల్ల పుట్టిందన్న అక్కసుతో భార్యకు తలాక్ చెప్పాడో భర్త. అదీ కూడా ఫోనులోనే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే....
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షుమైలా జావెద్ అనే మహిళ జాతీయ స్థాయిలో నెట్‌బాల్ క్రీడాకారిణి. ఆమె ఇటీవల ఆడబిడ్డకు జన్మనించింది. అంతే ఆమె భర్త ఫోనులో తలాక్ చేప్పేశాడు.
అలాగే, మరో మహిళ కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆమెకు కూడా భర్త తలాఖ్ ఇచ్చేశాడు. ఇక షాజహాన్‌పూర్‌కు చెందిన 22 ఏళ్ల అఫ్రిన్దీ ఇదే పరిస్థితి. ఆమె భర్త ఫోన్లో తలాఖ్ అంటూ ఓ మెసేజ్ పంపించాడు. అంతే వాళ్ల వివాహ బంధం అక్కడితో ముగిసిపోయినట్లే.
ఓవైపు ట్రిపుల్ తలాఖ్‌పై సీరియస్‌గా చర్చ నడుస్తున్నా.. అమాయక ముస్లిం మహిళల కష్టాలను మాత్రం తెరపడటం లేదు. ఇలా ఫోన్లు, ఫేస్బుక్, వాట్సాప్, పోస్ట్‌కార్డ్‌ల ద్వారా తలాఖ్ చెప్పడంపై ఇప్పటికే సుప్రీంకోర్టులోనూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
దీనికి ఫుల్స్టాప్ పెట్టాలని అటు కేంద్రప్రభుత్వం కూడా భావిస్తున్నది. తన వైఖరిని ఇప్పటికే కోర్టుకు స్పష్టంగా తెలియజేసింది. దీనిపై ఇక కోర్టే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ట్రిపుల్ తలాఖ్‌పై తమ నిర్ణయాన్ని వెలువరించనుంది.