గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 6 ఏప్రియల్ 2017 (09:43 IST)

ఉద్దేశపూర్వకంగానే ఏటీఎంలను ఎండబెడుతున్నారా? క్యాష్ లెస్ ఎకానమీ అంటే ఇదా?

పెద్దనోట్ల రద్దు జరిగి అయిదు నెలలు పూర్తి కావస్తోంది. కానీ ఏపీ, తెలంగాణలోని నగరాల్లో దాదాపు అన్ని ఎటీఎంలలోనూ నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఆనవాయితీ ప్రకారం ప్రతి బ్యాంకుకూ ఆర్బీఐ నుంచి 12 దఫాలు డబ్బు రావలసి ఉండగా మార్చి నెలలో కేవలం 5 సార్లు మాత

పెద్దనోట్ల రద్దు జరిగి అయిదు నెలలు పూర్తి కావస్తోంది. కానీ ఏపీ, తెలంగాణలోని నగరాల్లో దాదాపు అన్ని ఎటీఎంలలోనూ నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఆనవాయితీ ప్రకారం ప్రతి బ్యాంకుకూ ఆర్బీఐ నుంచి 12 దఫాలు డబ్బు రావలసి ఉండగా మార్చి నెలలో కేవలం 5 సార్లు మాత్రమే నగదు రావటం జరిగింది. ఇది నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అమల్లో భాగంగానే జరుగుతోందని బ్యాంకర్లు ప్రయివేటుగా చెబుతున్నారు. 
 
ఉదాహరణకు హైదరాబాద్ నగరాన్నే తీసుకుందాం. ఒక్క ఈ నగరంలోనే 5,200 ఏటీఎంలు ఉన్నాయి. సగటున ఒక్కో ఏటీఎంలో రోజుకు 5 లక్షల రూపాయలు పెడుతుంటారు. కానీ ఈ వారం పొడవునా 90 శాతం ఏటీఎంలలో డబ్బులేదు. వ్యాపారుల నుంచి, ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకుని లావాదేవీలు జరపాల్సిన బ్యాంకుల వద్ద నగదు లేదు. కారణం ఆర్బీఐ వాటికి డబ్బు పంపలేదు. ఇక వ్యాపారుల వద్ద నగదు లేకపోవడంతో వారు డిపాజిట్ చేయలేదు.
 
ఇప్పటికే 90 శాతం ఏటీఎంలను వృథాగా ఉంచుతున్న బ్యాకులు సమీప భవిష్యత్తులో పలు ఏటీఎంలను ఎత్తివేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఎలాగూ డబ్బులు లేవు. ఇక రావు కదా. వాటి నిర్వహణ దండగ అని బ్యాంకుల ప్లాన్
 
ఇంతకూ మనలోమాట. జనం దగ్గర డబ్బులు లేకుండా చేయడమే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్షణమా.. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఇలాగే జరుగుతోందా. 
 
పెనంలోంచి పొయ్యిలోకి పడటం అంటే ఇదేనా ..