సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (14:00 IST)

అనవసరపు ప్రయాణాలొద్దు : ఎయిమ్స్‌ చీఫ్‌

కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్‌ చీఫ్‌ డా. రణదీప్‌ గులేరియా పునరుద్ఘాటించారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల్లో పర్యాటకుల రద్దీ నేపథ్యంలో అక్కడ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

'మహమ్మారి ఇంకా ముగియలేదని చెబుతూనే ఉన్నాం. సూపర్‌ స్ప్రెడర్లు మారే సంఘటనలను మనం నిరోధించాలి. కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలి. సూపర్‌ స్రెడర్‌ సంఘటనలు మొదలైతే..దాని ప్రభావం మూడు వారాల తర్వాత కనిపిస్తోంది.

ఇంత అనర్థం దాగి ఉన్న నేపథ్యంలో అనవసరపు ప్రయాణం గురించి ఆందోళన చెందుతున్నాం' అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరి నాటికి 108 కోట్ల మంది వయోజనులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా.. పలు రాష్ట్రాలు...కరోనా వ్యాక్సిన్‌ కొరత ఉన్నట్లు చెబుతున్నాయి.