గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (10:51 IST)

ఢిల్లీలో చలిగాలులు.. పొగమంచు.. రైళ్ల రాకపోకలు ఆలస్యం.. స్కూల్స్ బంద్

cold temperature
దేశ రాజధాని నగరం ఢిల్లీలో చలిగాలులు పెరిగాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పొగమంచు కారణంగా కనీసం 26 రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయని భారతీయ రైల్వే తెలిపింది.
 
చెన్నై-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, అజ్మీర్-కత్రా ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ కంటే ఆరు గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆనంద్ విహార్ ప్రాంతంలో, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం పొగమంచుతో రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.  
 
అలాగే ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా జిల్లాలో తీవ్రమైన శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా జనవరి 6 వరకు పాఠశాలలను మూసివేయాలని సర్కారు ఆదేశించింది.