శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (12:31 IST)

నెటిజన్ల దృష్టి ఆకట్టుకున్న దేశీ వయగ్రా కంపెనీ ఇచ్చిన యాడ్..

పెద్దనోట్ల రద్దు వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం, ఈ-వాలెట్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా ప్రకటనలు ఇచ్చాయి. కానీ వీటన్నింటిలోనూ పెద్దనోట్ల రద్ద

పెద్దనోట్ల రద్దు వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం, ఈ-వాలెట్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా ప్రకటనలు ఇచ్చాయి. కానీ వీటన్నింటిలోనూ పెద్దనోట్ల రద్దుపై ఓ దేశీ వయగ్రా కంపెనీ ఇచ్చిన యాడ్‌ మాత్రం నెటిజన్ల దృష్టి ఆకర్షించింది. నోట్ల రద్దును సమర్థిస్తూ.. ఈ నిర్ణయానికి, లైంగిక సామర్థ్యం పెంచే తమ మాత్రలకు ఉన్న పోలికలను ఉటంకిస్తూ ఓ ప్రకటనను పేపర్లలో ఇచ్చింది. 
 
'థింక్‌ డిమానిటైజేషన్‌. థింక్‌ స్టే ఆన్‌'అంటూ శీర్షిక పెట్టి.. ఇది చేదు మాత్ర కాదు.. ఇది పవర్‌ క్యాప్సుల్‌' అంటూ.. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న నాయకుడికి ఎందుకు అభినందనలు తెలుపాలో, ఎందుకు మద్దతునివ్వాలో వివరించింది. ఫిర్యాదులు చేయడం మానుకోండి.. నిరంతరం కొనసాగుతూ ఉండండి అంటూ హిలేరియస్ వ్యాఖ్యానాన్ని చేసింది. సదరు దేశీ వయగ్రా కంపెనీ ఈ ప్రకటనను సరదాగా ఇచ్చిందో లేక సీరియస్‌గా ఇచ్చిందో తెలియదు కానీ, ఇందులో సరదా వివరణ మాత్రం నెటిజన్లను కితకితలు పెడుతోంది.